శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Modified: మంగళవారం, 2 జూన్ 2020 (22:42 IST)

లాక్‌డౌన్ సమయంలో విడుదల కానున్న ఆర్జీవీ క్లైమాక్స్..

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది. పెద్ద సినిమాలు ఇప్పట్లో భారీతనంతో చిత్రీకరణ జరుపుకునే అవకాశాలు లేవు. అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ, వర్మ మాత్రం కరోనాపై పాటలు, అలాగే ఇతర చిత్రాలను తీస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాడు. మరొకసారి తాను క్రియేటివ్ డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలోనే కరోనా వైరస్ అనే చిత్రాన్ని పూర్తి చేసాడు.
 
లాక్‌డౌన్‌కు ముందు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఎడారిలో క్లైమాక్స్ అనే చిత్రాన్ని తీసిన వర్మ, లాక్‌డౌన్ సమయాన్ని ఉపయోగించుకుని చిన్న ప్యాచ్ వర్క్‌లను కంప్లీట్ చేసాడు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను ఇంటి నుంచే పూర్తి చేసిన వర్మ, క్లైమాక్స్ ట్రైలర్‌ను విడుదల చేసాడు.
 
హర్రర్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన క్లైమాక్స్ సినిమాను జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు ఆర్జీవీ వరల్డ్.ఇన్, శ్రేయాస్ ఈటిలో విడుదల చేయబోతున్నారు. కాగా ఈ సినిమాను చూడాలంటే మాత్రం రూ. 100 చెల్లించాలని ఆర్జీవీ పేర్కొన్నారు. ఆర్జీవీ ఎప్పటిలాగానే తాను ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరుతానని ఛాలెంజ్ చేసాడు. దేవుడుగానీ, కరోనాగానీ తన క్లైమాక్స్ సినిమా విడుదలను ఆపలేవని వర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే.