గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (18:08 IST)

సౌత్ క్వీన్ షకీలా .. పోర్న్ స్టార్ కాదట..

సాదాసీదా స్థాయి నుంచి అత్యున్న‌త స్థాయికి ఎదిగిన దక్షిణాది అడ‌ల్ట్ స్టార్ ష‌కీలా. ఒక‌ప్పుడు మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మలో ష‌కీలాకి స్టార్ హీరోల‌కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ప్ర‌స్తుతం ఆమె జీవిత నేప‌థ్యంలో ష‌కీలా అనే బ‌యోపిక్ మూవీ తెరకెక్కుతోంది. 
 
ఇంద్ర‌జిత్ లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా ప్రధాన పాత్రను పోషిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పేరిట టైటిల్‌ లోగోను విడుదల చేశారు. ఇందులో 'నేను పోర్న్ స్టార్ కాదు' అని క్యాప్షన్ పెట్టారు. సినిమా సెట్‌లో శుక్రవారం తీసిన ఓ ఫొటోను పంచుకుంటూ.. ఇది తనకెంతో నచ్చిందని రిచా వ్యాఖ్యానించారు. 
 
తెలుగు‌తో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి రిచా చద్దా స్పందిస్తూ, షకీలా పాత్ర కోసం తనను సంప్రదించినప్పుడు తనకు భయమేసిందన్నారు. అయితే, షకీలాను కలిసి మాట్లాడిన తర్వాత ఈ సినిమా చేయగలను అనిపించిందని తెలిపారు. షకీలా తనకు అన్యాయం చేసినవారిని సైతం క్షమించారని, ఆమె వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత ఈ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చింది.