Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేణుకు చిన్మయి సపోర్ట్... విరుచుకుపడుతున్న పీకే ఫ్యాన్స్

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (14:55 IST)

Widgets Magazine
chinmayi sripada

జీవితాంతం ఒంటరిగా జీవించలేనని, రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మదిలో వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. పైగా, సరైన వ్యక్తి దొరికితే పెళ్లి గురించి తప్పకుండా ఆలోచన చేస్తానంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ మాటలపై పీకే ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 
 
'వదినమ్మా.. నీవు రెండో పెళ్లి చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టే'నని ఓ వీరాభిమాని రేణూను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరొకరు అయితే, 'మళ్లీ పవన్ కళ్యాణ్‌నే పెళ్లి చేసుకోవాలని' ఉచిత సలహా ఇచ్చారు. వీటిని చూసిన రేణూకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్‌పై ఆమె మండిపడ్డారు. దీంతో రేణు దేశాయ్ చాలా హాట్ టాపిక్ అయ్యారు. ఈ నేపథ్యంలో రేణును సపోర్ట్ చేస్తూ సింగర్ శ్రీపాద చిన్మయి పోస్ట్ పెట్టారు. దీంతో కొందరు పవన్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఒకరి పోస్టుకు స్పందించిన చిన్మయి.. "మీరు నేను మాట్లాడినదానితో ఏకీభవించకుంటే మర్యాదగా మాట్లాడండి. అప్పుడు నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పుంటే నేను సరిచేసుకుంటా.. కానీ నన్ను అవమానకరంగా మాట్లాడితే నేను పట్టించుకోను." అంటూ సమాధానమిచ్చారు. చిన్మయి.. రేణుకు సపోర్ట్‌గా ఒక్క పోస్ట్ పెట్టినందుకు ఎందరో ఆమెపై విరుచుకు పడ్డారు. చిన్మయి దాదాపు అందరికీ ఓపికగా సమాధానమిచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జరుగు.. జరుగెహె... తిరుపతిలో రకుల్ ప్రీత్ సింగ్... ఎవరిని...

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి ...

news

సమంతకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏంటదో తెలుసా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా పరిచయమైన...ఆపై ప్రేమ పక్షులుగా మారి.. ప్రస్తుతం ...

news

నా కొడుకు పెళ్లికొడుకయ్యాడు.. : నాగ్ ట్వీట్

అక్కినేని వారసుడు నాగ చైతన్య - సమంతల పెళ్లి మరికొన్ని గంటల్లో జరుగనంది. శుక్రవారం హిందూ ...

news

నాగచైతన్య పెళ్లికొడుకైన వేళ.. ఫోటోస్ చూడండి (వీడియో)

అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం హీరోయిన్ సమంతతో నాగచైతన్య వివాహం ...

Widgets Magazine