మనిషికి ఆ సామర్థ్యం వుంది.. జుట్టు కత్తిరించుకున్నాను.. సోనాలీ బింద్రే

మంగళవారం, 10 జులై 2018 (16:11 IST)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో మురారి సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సోనాలీ బింద్రే క్యాన్సర్ బారిన పడింది.  ఈ వ్యాధికి చికిత్స కోసం న్యూయార్క్ చేరుకుంది. చికిత్సలో భాగంగా సోనాలీ బింద్రే తన జుట్టుకు కత్తిరించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె అభిమానులతో పంచుకున్నారు.
 
తాను హై గ్రేడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల ట్విట్టర్లో సోనాలీ బింద్రే తెలిపింది. అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటోన్న ఆమె.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేసింది. తనపై కొందరు కురిపిస్తోన్న ప్రేమ పట్ల ఉద్వేగపూరిత ట్వీట్లు చేశారు. తన అభిమాన రచయిత ఇసబెల్ అలెండె ఓ విషయాన్ని రాశారని, మనలో దాగి ఉన్న శక్తిని మనం బలవంతంగా బయటకు తీసుకొచ్చే వరకు మనం ఎంత శక్తిమంతులమో మనకు తెలియదని పేర్కొంది.
 
కష్టకాలంలో మనిషి ఏదైనా చేయగలడని, కష్టాలను తట్టుకొని మనుగడ సాగించగలిగే అద్భుతమైన సామర్థ్యం మనిషి సొంతమని వ్యాఖ్యానించింది. తన అంతుపట్టేందుకు ప్రయత్నిస్తున్న క్యాన్సర్‌ను తరిమికొట్టే విషయంపై దృష్టిపెట్టానని.. వైద్యుల సూచన మేరకు న్యూయార్క్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని సోనాలీ తెలిపారు. దీనిపై మరింత చదవండి :  
సోనాలీ బింద్రే హై గ్రేడ్ కేన్సర్ ఇన్‌స్టాగ్రామ్ న్యూయార్క్‌ Newyork Cancer Instagram Tollywood America New Post Sonali Bendre Not Alone Sonali Bendre Cancer

Loading comments ...

తెలుగు సినిమా

news

మాజీ భర్తకు రెండో పెళ్లి.. బెంగ పెట్టుకుని షూటింగ్‌కు డుమ్మాకొట్టిన భామ!!

మలయాళ కపుల్స్ అమలా పాల్ - విజయ్. సినీ ఇండస్ట్రీకి చెందిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి ...

news

గీత గోవిందం.. #InkemInkemInkemKaavaale సాంగ్ మీ కోసం.. (వీడియో)

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ''గీత గోవిందం'' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ...

news

ఆ హీరో వల్లే పెళ్లి చేసుకోలేదు.. మేమిద్దరం 25 యేళ్లు కలిసున్నాం...

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో మోస్ట్ ముదురు హీరోయిన్ ఎవరయ్యా అంటే ప్రతి ...

news

మూడు వసంతాల 'బాహుబలి ది బిగినింగ్'

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ...