గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (12:46 IST)

ఆ సంబంధం తెంచుకుంది.. భర్తకు, బాస్‌కు ఆ వీడియోలు పంపేశాడు..?

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో నేరాలు పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తనతో వివాహేతర సంబంధాన్ని మధ్యలో ఆపేసిందనే అక్కసుతో.. ఆమె కాపురంలో నిప్పులు పోశాడు ఆమె మాజీ ప్రియుడు.

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో నేరాలు పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తనతో వివాహేతర సంబంధాన్ని మధ్యలో ఆపేసిందనే అక్కసుతో.. ఆమె కాపురంలో నిప్పులు పోశాడు ఆమె మాజీ ప్రియుడు. ఇందులో భాగంగా తనతో ఆమె గడిపిన వీడియోలను ఆమె భర్తకు పంపించాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని ఎల్టీ మార్గ్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఓ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఈమె భర్తకు పక్షవాతం రావడంతో మంచాన పడ్డాడు. దీంతో సోషల్ మీడియా ద్వారా 2016లో వివాహితకు దక్షిణ ముంబైకు చెందిన విజయ్ పవార్ పరిచయమయ్యాడు. కొన్నాళ్లు వీరి మధ్య సాగిన ప్రేమాయణాన్ని వివాహిత తెంచుకుంది. దీంతో ఆగ్రహం చెందిన ప్రియుడు విజయ్ పవార్ తనతో గడిపిన వీడియోలను ఆమె భర్త, కంపెనీ బాస్‌కు పంపించాడు. 
 
విజయ్ పవార్‌తో గడిపినపుడు వీడియోలు తీసిన విషయం వివాహితకు తెలియదు. మాజీప్రియుడు విజయ్ పవార్ తనకు తరచూ ఫోన్ చేసి సంబంధం కొనసాగించమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని వీడియోలు తన భర్తకు పంపించాడని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడైన విజయ్ పవార్‌ను అరెస్టు చేశారు.