Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి మరణం... రేపు ముంబైలో అంత్యక్రియలు!

ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (14:24 IST)

Widgets Magazine
sridevi deadbody

లెజండరీ నటి, అతిలోకసుందరి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్లింది. 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ను విజయవంతంగా ప్రారంభించిన శ్రీదేవి, ఆ తర్వాత తమిళంలో 'పులి' చిత్రంలోను, చిట్టచివరిగా 2017లో 'మామ్' సినిమాలోను నటించారు. 
 
దుబాయ్‌లో చనిపోయిన శ్రీదేవి భౌతికకాయం ఆదివారం ముంబైకి చేరుకోనుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి ఆస్పత్రిలో ఫార్మాలిటీస్ పూర్తి చేసి.. ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకురానున్నారు. దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రానికి ముంబై అంధేరిలోని స్వగృహానికి శ్రీదేవి భౌతికకాయం ఆదివారం రాత్రికి చేరుకుంటే.. సోమవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, 1963 ఆగస్టు 13వ తేదీన పుట్టిన శ్రీదేవి... అసలు పేరు అమ్మయ్యంగార్‌ అయ్యప్పన్‌. బాలనటిగా 1967లో సినిమాల్లోకి అరంగేట్రం చేసిన శ్రీదేవి.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో 'పదహారేళ్ళ వయసు' సినిమాతో హీరోయిన్‌గా అలరించారు. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ఇప్పటివరకూ 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు పొందిన శ్రీదేవిని 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అతిలోకసుందరి' శ్రీదేవికి మరణం లేదు.. 'జగదేకవీరుడు' చిరంజీవి

చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన తొలి చిత్రం "రాణికాసుల రంగమ్మ". ఆ తర్వాత రెండు మూడు ...

news

భగవంతుడు అన్యాయం చేశాడు.. శ్రీదేవి చూసి ఎంతో నేర్చుకున్నా: చిరంజీవి

అతిలోకసుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. శ్రీదేవి మరణవార్త విని షాక్ అయిన ...

news

నా కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన ధృవతార : జూనియర్ ఎన్టీఆర్

సినీ వినీలాకాశం నుంచి మరో ధృవతార నేలరాలింది. అతిలోకసుందరిగా జనం మదిలో నిలిచిపోయిన అందాల ...

news

దేశానికే డ్రీమ్ గర్ల్.. ఆమెలా ఎదగాలనుకున్నాం: రోజా

అతిలోకసుందరి... ఇక లేరనే వార్తను యావత్తు దేశం జీర్ణించుకోలేకపోతోంది. సినీ ప్రముఖులు, ...

Widgets Magazine