శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (12:26 IST)

జస్ట్ 24 గంటలు.. 12 మిలియన్ వ్యూస్ : ఇప్పటికి "సైరా"నే టాప్

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22వ తేదీకి ఒక్క రోజు ముందుగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి" సినిమా టీజర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన 24 గంటల్లోనే ఈ టీజర్ ఏకంగ

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22వ తేదీకి ఒక్క రోజు ముందుగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి" సినిమా టీజర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన 24 గంటల్లోనే ఈ టీజర్ ఏకంగా కోటి 20 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే తెలుగు సినిమా చరిత్రలో ఇదే టాప్‌ అంటున్నారు.
 
తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ నిర్మాతగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం టీజర్‌ను మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా మంగళవారం రిలీజ్ చేశారు.
 
అయితే, ఈ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సోషల్‌ మీడియాలో టీజర్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. వ్యూస్‌ విషయంలోనూ సైరా సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. అన్ని డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్‌లో కలిపి ఈ టీజర్‌ 24 గంటల్లో 12 మిలియన్ల(కోటి ఇరవై లక్షల) వ్యూస్‌ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సైరా నరసింహారెడ్డి సినిమాను 2019 వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.