Widgets Magazine

ఆర్థిక ఒత్తిళ్లు.. అవకాశాలు లేమి.. అందుకే ఆ డైరెక్టర్ సూసైడ్ అటెంప్ట్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇండస్ట్రీలో సినీ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికిలోనైన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ డైరెక్టర్ పేరు రాజసింహా. ఈయన స

Rajasimha
pnr| Last Updated: గురువారం, 17 మే 2018 (14:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ దర్శకుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇండస్ట్రీలో సినీ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికిలోనైన ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ డైరెక్టర్ పేరు రాజసింహా. ఈయన సందీప్ కిషన్ హీరోగా వచ్చిన "ఒక్క అమ్మాయి తప్ప" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
 
అంతేకాకుండా, 'రుద్ర‌మ‌దేవి', 'అన‌గ‌న‌గా ఓ ధీరుడు' వంటి సినిమాల‌కు ర‌చ‌యిత‌గా కూడా పని చేశారు. ముఖ్యంగా, 'రుద్ర‌మ‌దేవి' సినిమాలోని అల్లు అర్జున్ పోషించిన గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కు తెలంగాణ యాస‌లో మాట‌లు రాసింది రాజ‌సింహే. 
 
ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ఒక్క అమ్మాయి తప్ప చిత్రం పరాజయంపాలైంది. అనంతరం ఆయనకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో డిప్రెష‌న్‌కు గురైన ఆయ‌న ముంబైలోని తన నివాసంలోనే ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన ఆర్థిక ఒత్తిళ్లతో పాటు.. సినీ అవకాశాలు లేనికారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై మరింత చదవండి :