శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:22 IST)

'మా'లో మ‌రో వివాదం - రాజీనామా చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఇటీవ‌ల జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం అనేది వివాద‌స్ప‌దం కావ‌డం తెలిసిందే. ఆఖ‌రికి అన్నీ స‌ర్దుకున్నాయి అనుకుంటే... మా ఉపాధ్య‌క్షుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నం అయ్యింది. పోటాపోటీగా జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన‌ ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. 
 
ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన కొన్ని ప‌రిణామాలు ఆయ‌న‌కు బాధించాయ‌ట‌. అయినా స‌ర్దుకుపోయాను కానీ... ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌వి చూస్తుంటే... అసోసియేష‌న్ మ‌ళ్లీ గాడి త‌ప్పిన‌ట్టు అనిపిస్తుంది. అందుకే రాజీనామా చేశాననీ ఎస్వీ కృష్ణారెడ్డి స‌న్నిహితుల‌తో చెప్పార‌ట‌. 
 
మా అధ్య‌క్షుడు న‌రేష్ ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రుగుతోన్న ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసి ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా గురించి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటార‌ట‌. ఏదైతే ఏం మొత్తానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. మరి.. ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి..!