హిందీ అర్జున్ రెడ్డి నుంచి తప్పుకున్న హీరోయిన్ తారా సుతారియా

టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. తారా సుతారియా కథానాయిక పాత్ర పోషించేందుకు సంత

tara sutaria
pnr| Last Updated: శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:34 IST)
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. ఇందులో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నారు. తారా సుతారియా కథానాయిక పాత్ర పోషించేందుకు సంతకం చేసింది. ఈ నెలాఖరులో షూటింగ్‌ ప్రారంభంకానుంది. మాతృకకు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగానే దీన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకాకముందే ఈ మూవీ నుంచి హీరోయిన్ తారా సుతారియా తప్పుకుంది. ఆమె ప్రస్తుతం 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2'లో నటిస్తున్నారు. ఇది ఆమె తొలి సినిమా. టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడు. ఈ సినిమాను 2018 నవంబర్‌ 23న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. '2.ఓ' సినిమా విడుదల నేపథ్యంలో దీన్ని 2019 మే 10కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తారా సుతారియా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. దీంతో డేట్స్‌ కుదరక తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీనిపై మరింత చదవండి :