చెన్నై చిన్నదానికి అరుదైన పురస్కారం

సోమవారం, 20 నవంబరు 2017 (16:31 IST)

చెన్నై చిన్నది త్రిషకు అరుదైన పురస్కారం వరించింది. ప్రతిష్టాత్మక యునిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్ హాదాకు ఎంపికైంది. దీంతో పిల్లలు, యువత హక్కులను కాపాడేందుకు నిర్వహించే కార్యక్రమాల్లో త్రిష భాగస్వామ్యమవుతారని యునిసెఫ్ వెల్లడించింది.
trisha unicef
 
దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో చిన్నపిల్లల్లో ఎనీమియా, బాల్యవివాహాలు, బాలకార్మికులు, చిన్నారులపై వేధింపులు వంటి అంశాల్లో త్రిష తన మద్దతును అందించనుంది.
 
కౌమార దశలో ఉన్న పిల్లలు, యువతకు త్రిష ఐకాన్‌లాంటి వారని, కుటుంబం, బహిరంగ ప్రదేశాలు, కులాల్లో పిల్లలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే అధికారం ఆమెకు ఉంటుందని కేరళ, తమిళనాడు యునిసెఫ్ చీఫ్ జాబ్ జకారియా వెల్లడించారు. 
 
వీటితోపాటు చిన్నపిల్లలకు చదువు ఆవశ్యకతను తెలియజెప్పడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, సమాజంలో ఆడపిల్లల ప్రాముఖ్యత వంటి అంశాలను త్రిష ప్రమోట్ చేస్తారని ఆయన తెలిపారు. దీనిపై త్రిష కూడా సంతోషం వ్యక్తంచేశారు. దీనిపై మరింత చదవండి :  
Unicef Heroine Celebrity Status Trisha Krishnan

Loading comments ...

తెలుగు సినిమా

news

నంది అవార్డులపై చిరు స్పందించిన తీరు చూస్తే షాకే..

నంది అవార్డుల పేర్ల ప్రకటన కాస్త సినీరంగంలో అగ్రహీరోల మధ్య గ్యాప్ తెచ్చి పెట్టింది. ...

news

నన్ను చంపేస్తారా? దేశంలో ఏం జరుగుతోంది? 'పద్మావతి' దీపిక ప్రశ్న

పద్మావతి చిత్రంలో నటించినందుకు నన్ను చంపేస్తారా... అసలీ దేశంలో ఏం జరుగుతోంది అంటూ ...

'బాహుబలి' .. భళ్లాలదేవ - బుల్ ఫైట్ మేకింగ్ వీడియో

భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి - ది బిగినింగ్". ఈ చిత్రంలో విలన్ ...

news

పవన్ ఇంట్లో నేను బంట్రోతునే... సాయిధరమ్ తేజ్

నాకు ముగ్గురు మామయ్యలు. అందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. ...