గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (11:36 IST)

రాయలసీమ యాసలో నెలరోజుల విరామం లేకుండా ఎన్టీఆర్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత వీర రాఘవ". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత వీర రాఘవ". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇపుడు మూడో షెడ్యూల్ మొదలైంది. అయితే, ఈ షెడ్యూల్ పూర్తిగా రాయలసీమలో జరుగనుంది. మధ్యలో ఎలాంటి గ్యాప్ లేకుండా ఈ నెలంతా ఈ షెడ్యూల్ షూటింగ్ కొనసాగనుంది.
 
ఎన్టీఆర్‌తో పాటు ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో తెరకెక్కించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ కావడం... ఎన్టీఆర్ రాయలసీమ యాసలో మాట్లాడటం... సిక్స్ ప్యాక్‌తో కూడిన ఆయన న్యూలుక్.. తమన్ సంగీతం.. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంటోంది.