గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (13:51 IST)

అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన మాట‌ల మాంత్రికుడు

మాట‌ల మాంత్రికుడు అంటే చాలు ఠ‌క్కున ఆయ‌న పేరు గుర్తుకువ‌స్తోంది. ఎస్.. ఆయ‌నే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. తాజాగా తెర‌కెక్కించిన చిత్రం అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. మీడియాకి దూరంగా ఉండే ఈ మాట‌ల మాంత్రికుడు.. గ‌త రెండు మూడు రోజులుగా మీడియాకి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. త‌న మ‌న‌సులో మాట‌ల‌ను పంచుకుంటున్నారు. 
 
ఇంత‌కీ త్రివిక్ర‌మ్ ఏం చెప్పారంటే... ఓ మంచి క‌థ చెప్పాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేసార‌ట‌. 12 ఏళ్ల నుంచి ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాను. ఇన్నాళ్ల‌కు ఈ క‌థ‌తో సెట్ అయ్యింద‌ని చెప్పారు. ఎన్టీఆర్ కోసం అనుకున్న క‌థ ఇదేనా..? లేక వేరే హీరోతో అనుకుంటే ఎన్టీఆర్‌కి సెట్ అయ్యిందా..? అని అడిగితే… ఎన్టీఆర్‌కు నాలుగైదు సబ్జెక్ట్‌లు చెబితే, ఇద్దరం కనెక్ట్ అయింది అరవింద స‌మేత క‌థకే అని చెప్పారు. 
 
ఇంకా చెప్పాలంటే ఓ కొత్త ఎన్టీఆర్ క‌నిపిస్తారు అని చెప్పారు. ఎన్టీఆర్ ప్రాణం పెట్టి ఈ సినిమా చేసాడు. అస‌లు ఎన్టీఆర్ కుటుంబంలో జ‌రిగిన విషాదంతో షాక్ అయి ఈ సినిమాను స‌మ్మ‌ర్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ.. ఎన్టీఆర్ ఫోన్ చేసి షూటింగ్ ప్లాన్ చేయండి నేను షూటింగ్‌కి వ‌స్తాన‌ని చెప్పార‌ు‌. ఆయ‌న అంత విషాదంలో కూడా అలా న‌టించ‌డం వ‌ల‌నే ఈ సినిమా పూర్త‌య్యింద‌ని చెప్పారు.