శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (15:19 IST)

టెంట్ కాదు.. రాజభోగాలున్న రాజప్రసాదం : విద్యాబాలన్

బాలీవుడ్ సుందరాంగుల్లో విద్యాబాలన్ ఒకరు. ప్రస్తుతం ఈమె 'తుమార్హీ సులు' సినిమాలో నటిస్తోంది. లేట్ నైట్ ఆర్జే పాత్రలో నటించిన ఆమె ఈ సినిమా ప్రచారకార్యక్రమంలో భాగంగా గుజరాత్‌ రాష్ట్రంలోని భుజ్ ఏరియాకు వె

బాలీవుడ్ సుందరాంగుల్లో విద్యాబాలన్ ఒకరు. ప్రస్తుతం ఈమె 'తుమార్హీ సులు' సినిమాలో నటిస్తోంది. లేట్ నైట్ ఆర్జే పాత్రలో నటించిన ఆమె ఈ సినిమా ప్రచారకార్యక్రమంలో భాగంగా గుజరాత్‌ రాష్ట్రంలోని భుజ్ ఏరియాకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఓ టెంట్‌ను కేటాయించింది.
 
ఇందులో భాగంగా అన్ని సౌకర్యాలు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ టెంట్‌ను ఆమెకు కేటాయించారు. ఇందులో సోఫా, టీవీ, మల్టీమీడియా ప్లేయర్లు, రెండు బెడ్‌ గదులు ఉన్నాయి. నిజానికి ఈ టెంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే కేటాయిస్తారు.
 
దీనిపై విద్యాబాలన్ స్పందిస్తూ, 'ఆ టెంట్‌ చాలా అద్భుతంగా ఉంది. అందులో ఉన్నంతసేపూ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు అనిపించింది. నిజంగా ఓ రాజప్రసాదంలా ఉందని' అని చెప్పింది. కాగా, ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.