యూ ట్యూబ్‌లో 'దేవదాస్' చిత్రంలోని "వారు వీరు" ఫుల్ సాంగ్ (వీడియో)

nani - nag
Last Updated: బుధవారం, 7 నవంబరు 2018 (11:34 IST)
అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. ఈ చిత్రం బాలీవుడ్ రచయిత శ్రీరామ్ రాఘవన్ అందించిన మూలకథని ఆధారంగా చేసుకుని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తన ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయవంతీ మూవీస్ పతాకంపై నిర్మించారు.

ఈ చిత్రం మంచి స‌క్సెస్‌ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌వ‌ర్షం కురిపించింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా, క‌థానాయిక‌లుగా ఆకాంక్ష సింగ్, ర‌ష్మిక మంద‌న్నా న‌టించారు.

60 యేళ్ల వయసులో కూడా తన ఎనర్జీతో నాగార్జున ఆకట్టుకున్నారు. తనదైన శైలి నటనతో దేవ పాత్రకు ప్రాణంపోశారు. డాక్టర్ దాస్‌గా నాని పాత్ర ఆద్యంతం వినోదాల్ని పంచుతుంది. కామెడీ టైమింగ్, సహజ అభినయంతో ఈ పాత్రలో ఇమిడిపోయారు. వారిద్దరి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం సినిమాను నిలబెట్టింది. తాజాగా చిత్రం నుండి వారు వీరు అనే సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

దీనిపై మరింత చదవండి :