అంత‌రిక్షం ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంది.... ఎప్పుడు?

శ్రీ| Last Modified గురువారం, 6 డిశెంబరు 2018 (14:22 IST)
మెగా హీరో వ‌రుణ్ తేజ్ - ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి కాంబినేష‌న్లో రూపొందుతోన్న‌ సైన్స్ ఫిక్షన్‌ మూవీ అంతరిక్షం. వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న లావణ్య త్రిపాఠి, అతిధి రావు హైదరీ న‌టిస్తున్నారు. ఈ వైవిధ్య‌మైన చిత్రాన్ని క్రిష్ జగర్లమూడి నిర్మిస్తున్నారు. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్‌ 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.

ఈ నెల‌ 9 ఉదయం 11 గంటలను అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ లుక్, టీజర్‌లతో సినిమాపై అంచనాలను తీసుకువచ్చిన సంకల్ప్ రెడ్డి తెలుగు సినిమా స్థాయిని పెంచే దిశగా అంతరిక్షం సినిమాను రూపొందిస్తున్నారు. పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్‌ మూవీగా జీరో గ్రావిటీ సెట్స్‌ పైన సన్నివేశాలను చిత్రీకరించడం విశేషం.

హాలీవుడ్‌ స్థాయి టేకింగ్‌తో అద్భుతమైన విజువల్ వండర్‌గా అంతరిక్షం సినిమా ఉండబోతుందని టీజర్‌లోనే హింట్ ఇచ్చాడు దర్శకుడు. తొలిప్రేమ సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న వ‌రుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తాడో..?దీనిపై మరింత చదవండి :