ఎఫ్ 2 లేటెస్ట్ అప్‌డేట్ ఏంటి..?

venky-varun
శ్రీ| Last Modified శనివారం, 10 నవంబరు 2018 (21:32 IST)
విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా హీరో వ‌రుణ్ తేజ్.. వీరిద్ద‌రు క‌లిసి ఎఫ్ 2 సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర యూనిట్ బ్యాంకాక్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరుకుంది. ఇక ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగనుంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకమైన బ్రిడ్జి సెట్‌ను నిర్మించారు. 
 
ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ సన్నివేశాలు హిలేరియస్‌గా ఉండనున్నాయని సమాచారం. హీరోల తోపాటు హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతోన్న‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతి క‌లిగిస్తుందని...అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు బాగా న‌చ్చుతుందని టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాని జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :