ఇందిరా గాంధీగా కనిపించనున్న బాలీవుడ్ నటి
గురువారం, 11 జనవరి 2018 (12:26 IST)
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ మూవీ లేదా వెబ్ సిరీస్‌గా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా నటి విద్యాబాలన్ నటించనుంది. 'ఇందిర: ఇండియాస్ పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్' పేరుతో ప్రముఖ రచయిత సాగరికా ఘోష్ రాసిన నవలను వెబ్‌సిరీస్‌గా గానీ, సినిమాగా గానీ తెరకెక్కించనున్నారు.
అయితే ఏ రూపంలో రాబోతుందనే విషయం మీద ఇంకా స్పష్టత లేదు. తన పుస్తకం హక్కులను రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసినట్లు సాగరికా ఘోష్ సోషల్ మీడియాలో తెలిపారు. అలాగే విద్యాబాలన్ కూడా తాను ఇందిర పాత్రలో నటించబోతుండటం చాలా సంతోషంగా ఉందని ప్రకటించింది.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :
,
,
,
,