Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'మహానటి'లో ఏఎన్నార్ పాత్రలో విజయ్

బుధవారం, 8 నవంబరు 2017 (13:49 IST)

Widgets Magazine
vijay devarakonda

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ సొంత బ్యానెర్ వైజయంతి మూవీస్‌‌పై అలనాటి అందాల నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇందులో ప్రధాన పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇటీవల వివాహం చేసుకున్న సమంత కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
 
అయితే, తాజాగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ విజయ్‌ దేవరకొండ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారట. అలనాటి మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావుగా విజయ్ నటించనున్నారట. దీనికి కారణం మహానటి చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, హీరో విజయ్‌ దేవరకొండలు మంచి స్నేహితులు కావడమేనట.
 
వీరిద్దరూ గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రంలో కలిసి పనిచేశారు. అందుకే ఈ చిత్రంలో విజయ్‌ని అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు ఎంపికచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇక ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్న విషయంపై స్పష్టత రాలేదు.
 
అదేసమయంలో మహానటిలో అలనాటి విలక్షణ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్‌బాబు, శివాజీ గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌‌లు నటించనున్న విషయం తెల్సిందే. వీరితోపాటు దర్శకుడు క్రిష్‌, ప్రకాశ్‌‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజశేఖర్ మనసున్న మనిషి.. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు: సునీల్

సినీ నటుడు, వైద్యుడు అయిన హీరో రాజశేఖర్ మనసున్న మనిషి అని కమెడియన్ కమ్ హీరో సునీల్ ...

news

బ్రాహ్మణకులంలో పుట్టి అందరివాడినయ్యా... హిందూ విరోధిగా చిత్రీకరిస్తున్నారు: కమల్

తాను బ్రాహ్మణకులంలో పుట్టినప్పటికీ దర్శకదిగ్గజం కె.బాలచందర్ వెండితెరకు పరిచయం చేశాక తాను ...

news

పెళ్లై నెలైంది.. సమంత కోసం.. మళ్లీ వంట చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య దంపతులైన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రస్తుతం మినీ ...

news

యు.ఎస్‌.లో తెరకెక్కిన 'ప్రేమ మధురం..'

గోవర్ధన్‌ గజ్జల దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం 'ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత ...

Widgets Magazine