సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (11:39 IST)

#AskSaiPallavi విజయ్ గురించి సాయిపల్లవి ఏమన్నదంటే?

దర్శకుడు సెల్వరాఘవన్-సూర్య కాంబోలో తెరకెక్కిన సినిమా ఎన్జీకే. ఈ సినిమాలో సూర్యకు జోడీగా సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి #AskSaiPallavi అనే హ్యాష్ ట్యాగ్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సాయిపల్లవి బదులిచ్చింది. ఆ సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ఓ ఫ్యాన్ ప్రశ్నించాడు. 
 
అందుకు సాయిపల్లవి సమాధానమిస్తూ.. విజయ్‌కు ప్రజలను ఆకర్షించే శక్తి వుందని చెప్పాడు. ఇటీవల విలేకరులతో మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్‌పేయ్‌లకు తర్వాత ప్రజలను ఆకర్షించే నాయకుడు మోదీ అని ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఇదే తరహాలో తమిళ హీరో విజయ్‌కి ప్రజలను ఆకర్షించే శక్తి వుందని.. సూపర్ స్టార్ కామెంట్స్ పోలిన సాయిపల్లవి వ్యాఖ్యలు చర్చనీయాంశమైనాయి.