యూట్యూబ్ చానల్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాయ్ : వర్జిన్ బాయ్స్ నిర్మాత
Complined to GgP virjin boys team
సినిమా ప్రమోషన్ కోసం కొందరు రకరకాల ప్రమోషన్లు చేస్తున్నారు. గిఫ్ట్ ల రూపంలో ఫోన్లు, థియేటర్లో డబ్బులు ఇవ్వడం అనే కొత్త ఆచారానికి వర్జిన్ బాయ్స్ నిర్మాత శ్రీకారం చుట్టారు. తీసింది బూతు సినిమా అయినా నీతి మాత్రం చివర్లో వుంటుందని చెప్పారు. అందుకే ఇలాంటి నిర్మాతల్ని కొందరు మీడియా పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తుండడం మామూలైపోయింది. దీని వెనుక కొందరు హస్తం కూడా వుందనేది తెలిసిందే. ఇక నిన్న విడుదలైన వర్జిన్ బాయ్స్ సినిమా బాగోలేదని కొందరు ప్రచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిర్మాత.
ఈ సందర్భంగా నిర్మాత దారపునేని రాజా మాట్లాడుతూ, నిన్న సిటీలోని వేరు వేరు థియేటర్లకు వెళ్లినప్పుడు అక్కడ ప్రజాదరణ చూసి ఎంత సంతోషం వేసింది. అయితే ఇంత గొప్ప ఆదరణ పొందుతున్న సినిమాపై కొంతమంది మీడియా ముసుగులో విషం జల్లుతున్నారు. మేము థియేటర్లలో చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో స్వయంగా అర్థమైంది. కానీ పూల చొక్కా నవీన్ లాంటివారు మా సినిమా నుండి డబ్బులు డిమాండ్ చేసి అవి ఇవ్వకపోయేప్పటికి మాపై పగ పట్టి మా సినిమాను ప్రేక్షకులలో నెగిటివ్ చేసేందుకుగాను వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కావాలని మా సినిమా ఇమేజ్ డామేజ్ చేసే విధంగా రివ్యూలు ఇస్తున్నారు.
అలాగే మరికొందరు యూట్యూబ్ ఛానల్స్ సినిమా విడుదలకు ముందే సినిమాలపై నెగిటివ్గా రివ్యూలు ఇచ్చి ప్రేక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారు. వారిపై ఇప్పటికే ఫిలిం చాంబర్లో కంప్లైంట్ చేశాము. లీగల్ గా కూడా వారిపై చర్యలు తీసుకుంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. దయచేసి ప్రేక్షకులు అటువంటి వాడి రివ్యూలను నమ్మి మోసపోకండి. మా చిత్ర బృందానికి పనిచేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అన్నారు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ, మా సినిమాపై విషం జల్లడానికి ప్రయత్నిస్తున్న వారిపై తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము. అలాగే నటీనటులపై అతను చేసిన కామెంట్లపై కచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాము. మా సినిమాను థియేటర్లో చూసి ప్రతి సీనుకు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసిన ప్రేక్షకుల ఆదరణను మేము నమ్ముతాము అన్నారు.
ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జర్నీఫర్, రోనిత్, అన్షుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.