శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (14:45 IST)

''దేవ్'' సినిమా రివ్యూ.. అమ్మో ఒకటే బోర్... రకుల్, కార్తీ కెమిస్ట్రీ రిచ్

నటీనటులు: కార్తి, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, నిక్కి గల్రాని, కార్తిక్ ముతురామన్, ఆర్జే విగ్నేష్, రేణుక, వంశీ, జయకుమార్ తదితరులు. 

 
సంగీతం : హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం : వేల్ రాజ్
నిర్మాత : లక్ష్మణ్ కుమార్
దర్శకత్వం: రజత్ రవిశంకర్ 
 
తమిళ హీరో కార్తికి ఆవారా, ఊపిరి సినిమాల ద్వారా తెలుగులో మంచి ఫాలోయింగ్ వుంది. తాజాగా కార్తి దేవ్ అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా విడుదైంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పిస్తోంది. ఎస్.లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు నిర్మాతలు. ఈ సినిమా రివ్యూ ఎలా వుందో చూద్దాం.. 
 
కథలోకి వెళ్తే.. 
ఉన్నత కుటుంబానికి చెందిన దేవ్ అందరిలా కాకుండా సాహసోపేతంగా రాణించాలనుకుంటాడు. మనసుకు నచ్చినట్లు జీవించడంలోనే ఆనందం ఉందని భావిస్తాడు. అలాంటివాడు జీవితాన్ని ఒక పెద్ద కంపెనీకి సీఈవోగా ఉంటూ క్రమ పద్ధతిలో సాగిస్తున్న మేఘన (రకుల్ ప్రీత్ సింగ్)ను చూసి ఇష్టపడతాడు. మేఘన దేవ్‌ల ప్రయాణం ఎలా సాగింది.. సాహసోపేతంగా రాణించాలనే దేవ్ సాధించాడా లేదా అనేది మిగిలిన కథ. 
 
విశ్లేషణ 
దేవ్‌లో కార్తి, రకుల్ కెమిస్ట్రీ అదిరింది. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇదే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. సినిమ రిచ్‌గా వుండేలా నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ కథలో మాత్రం కొత్తదనం లేదు. లవ్ స్టోరీ బోర్ కొట్టేసింది. 
 
రెండున్నర గంటల సేపు ప్రేక్షకుడికి దర్శకుడు ఎక్కడా ట్విస్ట్ ఇవ్వలేదు. బోరింగ్‌ దేవ్ స్టోరీ మారిపోయింది. ఖాళీగా వున్నప్పుడు హీరోను వదిలేయడం.. బిజీగా మారినా.. తన ధ్యాస లేదని హీరోయిన్ వదిలిపోవడం వంటి కాన్సెప్ట్ ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదనే చెప్పాలి. 
 
ప్రేమ సన్నివేశాలేవీ కూడా ఆసక్తి రేకెత్తించవు. కామెడీ పండలేదు. ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ లాంటి పెద్ద నటీనటుల్ని పెట్టుకుని వాళ్లకు పేలవమైన పాత్రలిచ్చారు. వారికి ఎవరో డబ్బింగ్ చెప్పడంతో అసలేమాత్రం ఆ పాత్రలతో కనెక్ట్ కాలేం. మొత్తంగా హీరో హీరోయిన్ల ఆకర్షణ.. సాంకేతిక హంగులు.. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ మినహాయిస్తే ''దేవ్''లో చెప్పుకోవడానికి ఏమీ లేదు.
 
ప్లస్ పాయింట్స్
సంగీతం
కార్తి, రకుల్ ప్రీత్ కెమిస్ట్రీ 
ఛాయాగ్రహణం 
 
మైనస్ పాయింట్స్ 
పేలవమైన రోల్స్ 
ట్విస్టులు లేని స్టోరీ 
డైరక్షన్ 
కథ 
 
రేటింగ్ 
1.5/5