Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమల కొండ కిట కిట..

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:51 IST)

Widgets Magazine
garuda

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలంటేనే ఒక పండుగ. అలాంటిది బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ అంటే ఇక చెప్పనవసరం లేదు. ఇసుకేస్తే రాలనంత జనం. ప్రతి గరుడ వాహనసేవకు లక్షలాదిమంది భక్తులు తిరుమల కొండపైకి తరలివస్తారు. మంగళవారం మధ్యాహ్నానికే రెండున్నర లక్షమంది ఉన్న తిరుమలలో ప్రస్తుతం మరో రెండున్నర లక్షల మందికి పెరిగి మొత్తం 5 లక్షల మందికి చేరుకుంది. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే ఎంతో మంచిదన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమ్మకం కూడా. 
 
అందుకే ప్రతియేటా జరిగే గరుడ వాహనసేవకు అనూహ్యంగా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈసారి బ్రహ్మోత్సవాల్లోనూ అదే పరిస్థితి. జనం. జనం.. ఇసుకేస్తే రాలనంత జనం. భక్తులతో మొత్తం తిరుమల నిండిపోయింది. ఎక్కడా కాస్తంత జాగా కూడా లేదు. 
 
తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచే భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. రాత్రి జరిగే గరుడ వాహనసేవకు ఇప్పటికే తితిదే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాత్రి 7.30 నిమిషాలకే గరుడ వాహన సేవను టిటిడి నిర్వహించనుంది. గ్యాలరీలన్నీ ఇప్పటికీ భక్తులతో నిండిపోయాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

కోరిందల్లా ప్రసాదించే కల్పవక్షవాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి... (Video)

తిరుమల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ...

news

కోరిన కోర్కెలు తీర్చేందుకు కల్పవృక్ష వాహనంపై వేంచేసిన శ్రీవారు(video)

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు ...

news

భక్తులు తిరుమలకు రావద్దండి... కొండంత జనం.. రేపే గరుడ సేవ..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం గరుడసేవ రేపు రాత్రి జరుగనుంది. ...

news

సింహ వాహనంపై శ్రీవారు... పులకితులైన భక్తులు (వీడియో)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు ...

Widgets Magazine