Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కోరిన కోర్కెలు తీర్చేందుకు కల్పవృక్ష వాహనంపై వేంచేసిన శ్రీవారు(video)

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (17:12 IST)

Widgets Magazine

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాల్గవ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు కల్పవృక్షవాహనంలో మాడావీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రకృతికి శోభను తీసుకొచ్చేది, మనిషికి జీవ వాయువుని అందించేది చెట్టు. సృష్టిలోని వృక్షాలన్నిటిలోకి మేటిది కల్పవృక్షం. కల్పవృక్షంపై కొలువు తీరిన వేంకటేశ్వరుడిని తమిళులు రాజమన్నార్ అవతారంగా కొనియాడతారు. భక్తులు కోరిన కోర్కెలను కల్పవృక్షం, కామధేనువు, చింతామణి తీరుస్తాయనది పురాణ ప్రాశస్త్యం.
KalpaVriksha vahanam
 
తనను శరణు కోరిన భక్తుల కొర్కెలను తీరుస్తానని చెప్పడానికే శ్రీవారి ఉభయ దేవేరులతో కలసి కల్పవృక్షంపై దర్శనమిచ్చారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పికలు లేకపోవడం పూర్వజన్మ స్మరణ కలగడంతో పాటు కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయి. కల్పవృక్షం సకల ఫలప్రదాయం, కావున తనను వేడుకున్నవారికి తానే అన్ని సమకూర్చుతాడని ఈ వాహనసేవ ద్వారా స్వామి వారు భక్తులకు తెలియజేస్తున్నారు. 
 
కల్పవృక్ష వాహనంలో పశువుల కాపరైన గోపాలకృష్ణుడి రూపంలో స్వామి వారిని అలంకరించారు. నిస్సంకల్ప స్థితికి నిష్కామ స్థితికి, నిశ్చింతా స్థితికి కల్పవృక్ష వాహన దర్శనం ద్వారానే ఆ ఫలాన్ని పరిపూర్ణంగా పొందగలరు. ఈ వాహనంలో ఊరేగే స్వామి వారిని చూసేందుకు అశేష భక్తజనం మాడవీధుల్లో బారులు తీరారు. స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు ఇచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. వీడియో చూడండి...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వెబ్‌దునియా స్పెషల్ 08

news

భక్తులు తిరుమలకు రావద్దండి... కొండంత జనం.. రేపే గరుడ సేవ..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం గరుడసేవ రేపు రాత్రి జరుగనుంది. ...

news

సింహ వాహనంపై శ్రీవారు... పులకితులైన భక్తులు (వీడియో)

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు ...

news

శ్రీవారి కాసుల హారాన్ని చూస్తే కళ్ళు తిరుగుతాయ్.. గోవిందా...

తిరుమల శ్రీవారికి ఆభరణాలకు కొదవా... ఆపద మ్రొక్కులవాడికి ఎప్పుడూ ఆభరణాలు వస్తూనే ఉంటాయి. ...

news

చిన్నశేషునిపై చిద్విలాసం చేసిన శ్రీనివాసుడు (video)

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ...

Widgets Magazine