స్వాతంత్ర దినోత్సవం- ఆర్మీ జవాన్ పాదాలను తాకిన చిన్నారి (వీడియో)
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో దేశభక్తికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఆర్మీ జవానుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెడింగ్ అవుతోంది. ఈ వీడియో పాతదైనప్పటికీ నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ మెట్రో స్టేషన్లో నిల్చొనివున్న ఆర్మీ జవాన్ పాదాలకు ఓ చిన్నారి పాదాభివందనం చేసింది. ఈ వీడియోను బెంగుళూరు ఎంపీ పీసీ మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. "యువతకు ఇటువంటి విలువలను అందించడం అనేది దేశం పట్ల ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం అవుతుంది" అని రాసుకొచ్చాడు.
నలుగురు ఆర్మీ జవాన్లు ఓ మెట్రో స్టేషన్ వద్ద నిలబడి వుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. అపుడు వారి వద్దకు ఓ చిన్నారి పరుగెత్తుకుంటూ వెళ్లి కొద్దిసేవు వారిని అలా చూస్తూ ఉండిపోయింది.
ఆ తర్వాత ఒక జవాను పాదాన్ని తాకి దండం పెట్టుకుంటుంది. దీంతో ఆ సైనికుడు భావోద్వేగానికి గురై ఆయన చిన్నారిని ఆప్యాయంగా రెండు చెంపలు తాకి ఆశీర్వదిస్తాడు.