శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (12:32 IST)

కర్ణాటక హైడ్రామా.. రాజీనామా చేసిన యడ్యూరప్ప.. శ్రీరాములు కూడా...

కర్ణాటక రాష్ట్రంలో హైడ్రామా నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కర్ణాటక అసెంబ్లీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ పరీక్ష శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. ఇందుకోసం శనివారం

కర్ణాటక రాష్ట్రంలో హైడ్రామా నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కర్ణాటక అసెంబ్లీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ పరీక్ష శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. ఇందుకోసం శనివారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర శాసనసభ సమావేశమైంది.
 
ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే, ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీరాములు సైతం ఇప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానానికి రాజీనామా సమర్పించారు. 
 
వీరిద్దరి రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శనివారం ఆమోదించారు. యడ్యూరప్ప షిమోగ లోక్‌సభ స్థానం నుంచి, శ్రీరాములు బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 
 
కాగా, ఈనెల 15వ తేదీన వెల్లడైన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 38, ఇతరులకు 2 సీట్లు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు.