మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వి
Last Modified: శుక్రవారం, 31 జులై 2020 (17:07 IST)

ఆగస్టులో బ్యాంకులకు భారీ సెలవులు... ముందుజాగ్రత్తగా ఉండాలి గురూ...

ఈ రోజు జూలై చివరి రోజు. శనివారం నుండి ఆగస్టు వరకు నెల ప్రారంభం. డబ్బు అవసరమున్న ప్రతి ఒక్కరూ వెళ్లవలసిన ప్రదేశం బ్యాంకు. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఇంటి నుండి పనులు చేస్తున్నారు.

కాని బ్యాంకర్లకు మాత్రం ఉపశమనం లేదు. అవసరమైన సేవ కారణంగా వారు నిరంతరం బ్యాంకుకు వెళ్లవలసి వస్తోంది. వినియోగదారుల సమూహం కూడా ఎక్కువగానే ఉంది. దీంతో బ్యాంకు ఉద్యోగులలో ఆందోళన ఉంది. ఈ సమయంలో వారికి ఉపశమనం అందే వార్త వచ్చింది.
 
ఆగస్టు నెలలో బ్యాంకులు చాలావరకు మూసివేయబడుతాయి. అటువంటి పరిస్థితులలో ఖాతాదారులు బ్యాంకులకు వెళ్లే ముందు సెలవుల వివరాలను తెలుసుకోవడం మంచిది. మనకందరికి తెలిసిన విషయం బ్యాంకు రెండు, నాల్గవ శనివారాలు ఉండవని మాత్రమే. ఆగస్టు 1న మొదటి శనివారం, దీని ప్రకారం బ్యాంకు తెరిచి ఉండాలి కాని బక్రిద్ కాబట్టి సెలవు. ఆగస్టు 2 ఆదివారం, ఆగస్టు 3 రక్షాబంధన్, ఆగస్టు మొదటి వారం 3 నుండి 9వరకు బ్యాంకు ఉంటుంది.
 
ఆగస్టు8 రెండవ శనివారం, 9 ఆదివారం కాబట్టి సెలవులు. ఇక ఆగస్టు 10 నుండి 16 వరకు చూద్దాం. ఆగస్టు 11, 12 కృష్ణాష్టమి, 13 దేశభక్తుల దినోత్సవం, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16 ఆదివారం, ఆగస్టు 20, 21 సెలవులు, 22 గణేష్ చతుర్థి, 23 ఆదివారం, ఆగస్టు 29 మొహర్రం, 30 ఆదివారం, ఆగస్టు 31 ఓనం కాబట్టి సెలవు ఉంటుంది. కనుక బ్యాంకులతో లావాదేవీలు చేసేవారు ముందుగానే అన్నీ చేసుకోవడం మంచిది.