1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (12:00 IST)

టిక్ టాక్ పిచ్చి.. వరద నీటితో ఓవరాక్షన్.. కొట్టుకుపోయాడు..

టిక్ టాక్‌ పిచ్చి మాత్రం జనాల్లో ఏమాత్రం తగ్గలేదు. బీహార్‌‌లో వర్షం బీభత్సం కారణంగా వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద నీటిలో టిక్‌టాక్ చేయబోయి.. ఉద్ధృతికి కొట్టుకుపోయాడు ఓ యువకుడు. మూడు రోజుల క్రితం అద్దావ్‌పూర్‌కి చెందిన అఫ్జల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి టిక్‌టాక్ చేసేందుకు వరద నీటి వద్దకు వెళ్లాడు.
 
తొలుత అప్జల్ స్నేహితుడు నీటిలో డైవ్ చేయగా, ఆ తరువాత అఫ్జల్ కూడా దూకాడు. అయితే, వరద ఉద్ధృతి కారణంగా అప్జల్ కొట్టుకుపోయాడు. వెంటనే అతడి స్నేహితుడు అధికారులకు సమాచారం ఇవ్వగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. సహాయక సిబ్బంది అప్జల్ మృతదేహాన్ని కనుగొన్నారు.