శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (13:00 IST)

బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ హరిబాబు ఎందుకు రిజైన్ చేశారంటే...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఈయన ఉన్నట్టుండి తన పదివికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఈయన ఉన్నట్టుండి తన పదివికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు.
 
అయితే, హరిబాబు రాజీనామా లేఖ ఇపుడు బీజేపీ కలకలం రేపింది. ఉన్నట్టుండి ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తే, గత కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీకి, బీజేపీకి మధ్య వైరం నెలకొంది. దీంతో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. 
 
ఆ తర్వాత టీడీపీపై బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. కానీ, హరిబాబు మాత్రం టీడీపీ నేతలు లేదా టీడీపీ అధినేత చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. దీంతో సొంత పార్టీలోనే హరిబాబుబై విమర్శలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు వీలుగా కంభంపాటి రాజీనామా చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు సమాచారం. అందుకు మార్గం సుగమం చేసేందుకునే కంభంపాటి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.