Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బీఎస్ యడ్యూరప్ప అనే నేను'... కర్ణాటక ముఖ్యమంత్రిగా...

గురువారం, 17 మే 2018 (09:16 IST)

Widgets Magazine

బీఎస్ యడ్యూరప్ప అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అంటూ యడ్యూరప్ప కన్నడ రాష్ట్ర సీఎంగా గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ దూతగా కేంద్ర మంత్రులు ప్రకాష్ జావదేకర్, జేపీ నడ్డా, సదానంద గౌడ హాజరయ్యారు.
bs yaddyurappa
 
కాగా, కన్నడనాట జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పూర్తి మెజారిటీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం తదితర కారణాలతో యడ్యూరప్ప సీఎం పీఠాన్ని అధిరోహించే కార్యక్రమానికి సాధ్యమైనంత దూరంగా ఉంటేనే మంచిదని బీజేపీ అగ్రనేతలు భావించినట్టు తెలుస్తోంది. అందుకే సీనియర్ నేతలెవ్వరూ హాజరుకాలేదు. కాగా, రాజ్‌భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమం జరిగింది. 
 
కాగా, తాను 17వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని యడ్యూరప్ప నాలుగు రోజుల క్రితమే వెల్లడించిన సంగతి తెలిసిందే. 15న తన గెలుపు ఖాయమని, అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, తమ పార్టీ అధ్యక్షుడిని కలిసి ఆయన్ను ఆహ్వానిస్తానని వెల్లడించిన యడ్యూరప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో వారితో ఫోన్‌లో మాట్లాడారే తప్ప ఢిల్లీకి వెళ్లలేదు. 
 
మరోవైపు, 104 సీట్లు మాత్రమే ఉన్న బీజేపీకి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే మరో 8 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. పైగా, బలనిరూపణకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఇచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కర్ణాటకలో బీజేపీ అయితే బీహార్‌లో మాదే పెద్దపార్టీ : తేజశ్వి

కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని భావిస్తే, బీహార్ ...

news

రాజ్యాంగ ధర్మాస తీర్పును తుంగలో తొక్కిన కర్ణాటక గవర్నర్

హంగ్ అసెంబ్లీ ఎర్పడిన కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ రసకందాయంలో పడింది. కాంగ్రెస్ - జేడీఎస్ ...

news

రేపే యడ్డి సీఎంగా ప్రమాణం... కాంగ్రెస్-జెడీఎస్ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో...

కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పుతో అక్కడి రాజకీయ పార్టీలు తలలు బాదుకుంటున్నాయి. రేపు భాజపా ...

news

టిటిడి మొదటి బోర్డు మీటింగే వివాదాస్పదం.. ఎందుకు?(Video)

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల ...

Widgets Magazine