పదేళ్ళ బాలికపై శతాధిక వృద్ధుడి అత్యాచారం.. ఎక్కడ?

సోమవారం, 9 జులై 2018 (14:06 IST)

కాటికి కాళ్లుచాపిన 99 యేళ్ల వృద్ధుడొకరు కామంతో కళ్లుమూసుకునిపోయి పదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన ఇంట్లో అద్దెకు ఉంటూ తనవద్దే ఆట్లాడుకునేందుకు వచ్చే ఆ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పైగా, ఈయన గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ చేశాడు. ఈ దారుణం చెన్నై నగరంలో జరిగింది.
 
నగర శివారు ప్రాతంమైన సెన్నీర్ కుప్పానికి చెందిన కె.పరశురామన్ అనే 99 యేళ్ళ వృద్ధుడు గతంలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు. ఈయనకు ఇదే ప్రాంతంలో ఐదు చోట్ల ఇల్లు ఉన్నాయి. వీటిన్నింటినీ అద్దెకు ఇచ్చి, ఆ అద్దె డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో తాను నివశించే ఇంట్లోనే ఓ పోర్షన్‌లో అద్దెకు ఉండే కుటుంబంలోని చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణం గత కొన్ని రోజులుగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆ చిన్నారి కడుపునొప్పి రావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది. 
 
వెంటనే పోలీసులను సంప్రదించగా పక్కింటి కురువృద్ధుడే చిన్నారిని శారీరకంగా హింసిస్తున్నాడని తేల్చారు. చిన్నారి తండ్రి వెంటనే ఆ 99 ఏళ్ల వృద్ధిడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అరెస్టైన వ్యక్తికి ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతేకాకుండా చాలా మంది మనమలు, మనవరాళ్లు ఉన్నారు. ఆయనకు ముత్తాత కూడా. ఆయన పిల్లలంతా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. దీనిపై మరింత చదవండి :  
వృద్ధుడు బాలిక అత్యాచారం లైంగికదాడి Chennai Girl చెన్నై Sexually Assaults 99-year-old Man

Loading comments ...

తెలుగు వార్తలు

news

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది.. వరదల్లో 100 మంది మృతి..

జపాన్‌పై ప్రకృతి కన్నెర్ర చేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జపాన్‌ను ...

news

65 యేళ్ళ వయసులో అక్రమసంబంధం అంటగట్టి భార్యను చంపిన వృద్ధ భర్త

ఓ వృద్ధ భర్త అత్యంత కిరాతక చర్యకు పూనుకున్నాడు. 65 యేళ్ల వయసులో ఉన్న తన భార్యకు ...

news

బాలయ్య మనవడికి ఏం పేరు పెట్టారో తెలుసా?

నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని, భరత్ దంపతులకు అబ్బాయి పుట్టిన సంగతి తెలిసిందే. ...

news

కాబోయే భార్య నగ్న దృశ్యాలు చూసిన వరుడు....

తనకు కాబోయే భార్య ఎంతో పవిత్రంగా, సంప్రదాయబద్ధంగా ఉండాలని ప్రతి వరుడూ కోరుకుంటారు. కానీ, ...