Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీజేపీతో టీడీపీ తెగదెంపులు.. జగన్‌కు క్లీన్‌చిట్...?

శుక్రవారం, 9 మార్చి 2018 (09:47 IST)

Widgets Magazine
Jagan

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమతమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. ఆ మరుక్షణమే వివిధ రకాల అవినీతి కేసుల్లో చిక్కుకునివున్న వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి క్లీన్‌చిట్‌లు మొదలయ్యాయి. తాజాగా జగతి పబ్లికేషన్‌కు చెందిన రూ.34.6 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల జప్తు కేసులో ఈడీ అప్పీలేట్‌ అథారిటీ క్లీన్‌ చిట్‌ ఇవ్వడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
నిజానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో తెగదెంపులు చేసుకుని వైకాపాతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ నేతలు ఉవ్విళ్ళూరుతూ వచ్చారు. దానికి అనుగుణంగానే వారు పావులు కదుపుతూ వచ్చారు. పైకి మాత్రం 'జగన్‌తో మాకు రహస్య ఒప్పందం లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్‌తో చేతులు కలపాలన్న ఉద్దేశం కూడా మాకు లేదు. మీరు అనవసరంగా అపోహ పడుతున్నారు' అని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించారు కూడా. 
 
ఆ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని తాజాగా తేలిపోయింది. కేంద్రమంత్రివర్గం నుంచి టీడీపీ ఎంపీలు వైదలొగడంతోనే జగన్‌కు క్లీన్ చిట్ లభించింది. జగన్‌కు ఈడీ కేసుల్లో క్లీన్‌ చిట్‌ ఇవ్వడం, కేసుల విషయంలో సీబీఐ తదుపరి చర్యలు తీసుకోకపోవడం, ఆయన రాజకీయంగా బలోపేతం కావడానికి పరోక్ష సహకారం అందించడం వంటి ప్రయోజనాలు కేంద్రం ద్వారా లభించవచ్చునని చెబుతున్నారు. 
 
మాధవ్‌ రామచంద్రన్‌, ఏకే దండమూడి, టీఆర్‌ కన్నన్‌ల నుంచి పెట్టుబడులు స్వీకరించినందుకు ఇదే కేసులో సీబీఐ ఐపీసీ, మనీ లాండరింగ్‌, అవినీతి నిరోధక చట్టాల కింద చార్జిషీటు దాఖలు చేసింది. అయితే... ఈ విషయంలో క్విడ్‌ ప్రోకో జరగలేదని తాజాగా ఈడీ అప్పిలేట్‌ అథారిటీ క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయలలిత కాళ్లు తొలగించలేదు.. నేనే వేళ్లను కట్టాను: అమ్మ డ్రైవర్

దివంగత సీఎం జయలలిత మృతిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా అమ్మ డ్రైవర్ సంచలన ...

news

చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను ఇంటిలోకి తీసుకెళ్లి...

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఓ బాలికకు చాక్లెట్ ...

news

రాజకీయ చరిత్రలో ఏ మంత్రి చేయని పని చేస్తున్న కామినేని శ్రీనివాస్.. ఏంటది?

గత కొన్నిరోజులుగా టిడిపి, బిజెపి నేతల మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు ...

news

ఆ రోజు ఆ పని చేశాడని, మహిళ దినోత్సవం నాడు చెప్పుతో కొట్టిన టీచర్

తమపై జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి, తగిన బుద్ధి చెప్పడానికి చాలామంది అదను కోసం ...

Widgets Magazine