మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (11:04 IST)

పాముకు సబ్బేసి మరీ స్నానం చేయించిన యువకుడు (వీడియో వైరల్)

పాము అంటేనే ఆమడదూరం పారిపోతారు చాలామంది. కానీ పాముకు ఓ యువకుడు సబ్బేసి మరీ స్నానం చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఇంట్లోకి పాము వస్తే జనాలు పరుగులు తీస్తారు. లేకుంటే దాన్ని కొట్టి చంపేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో ఓ యువకుడు భుజంపై వేసుకునే టవల్‌ను ఉతికే తరహాలో.. తాను ఆశగా పెంచుకునే పామును సబ్బేసి మరీ స్నానం చేయించాడు. సబ్బు నురగ బాగా వచ్చేంతవరకు దాన్ని కడిగి మరీ శుభ్రం చేశాడు. అది నాగుపాము అయినా ఆ యువకుడు ఏమాత్రం జడుసుకోకుండా దానికి స్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.