శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (09:41 IST)

కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత...

కేంద్ర మాజీ మంత్రి, సమతా పార్టీ అధినేత జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయనకు వయసు 88 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతూ వచ్చిన ఆయన.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈయన మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లారు. ఫెర్నాండెజ్ మృతిపట్ల వివిధ పార్టీల నేతలు విచారాన్ని వ్యక్తం చేశారు.  
 
1930 జూన్ మూడో తేదీన జన్మించిన ఫెర్నాండెజ్... ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా, అనేక కార్మిక శాఖల్లో అత్యంత కీలకమైన భూమికను పోషించారు. అలాగే, మాజీ ప్రధాని భారతరత్న వాజ్‌పేయి మంత్రివర్గంలో ఆయన రక్షణ శాఖామంత్రిగా ఉన్నారు. అదేవిధంగా రైల్వే, పరిశ్రమలు, కార్మిక శాఖామంత్రిగా కూడా పని చేశారు.