మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (12:30 IST)

మోడీ పర్యటనలో త్రివర్ణపతాకం చిరిగిపోయింది.. బ్రిటన్ సారీ చెప్పింది...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో త్రివర్ణపతాకం చిరిగిపోయింది. దీంతో బ్రిటన్ సారీ చెప్పింది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో భారత జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనల్లో త్రివర్ణపతాకం చిరిగిపోయింది. దీంతో బ్రిటన్ సారీ చెప్పింది. 
 
ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ పార్లమెంట్ స్కేర్‌‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పార్లమెంట్ స్కేర్‌‌లో మోడీకి వ్యతిరేకంగా 500 మంది ఆందోళనకారులు నిరసన తెలిపారు. ఇందులో యూకే సిఖ్ ఫెడరేషన్‌‌కు చెందిన ఖలిస్థాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ సంతతి వ్యక్తి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలోని మోడీని వ్యతిరేకించే మైనార్టీలు కూడా వీళ్లలో ఉన్నారు.
 
ఈ ఆందోళనల్లో త్రివర్ణ పతాకం చినిగిపోయింది. దీంతో అక్కడి భారత అధికారులు ఈ ఘటనపై విదేశాంగ కార్యాలయంతో పాటు స్కాట్లాండ్ యార్డ్‌కు ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. అయితే పార్లమెంట్ స్కేర్‌‌లో జరిగిన ఘటన మమ్మల్ని అసంతృప్తికి గురిచేసింది. దీని గురించి తెలిసిన వెంటనే హై కమిషనర్ యష్‌వర్ధన్ కుమార్ సిన్హాతో మాట్లాడాం. మోడీ టూర్ కారణంగా భారత్‌తో యూకే బంధం మరింత బలోపేతమైంది అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.