బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 23 మే 2018 (08:58 IST)

కర్ణాటకకు వ్యాపించిన నిపా.. ఇద్దరికి సోకిన వైరస్...

కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. ఈ కేరళ సరిహద్ద

కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఇపుడు కర్ణాటక రాష్ట్రానికి వ్యాపించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, ఇద్దరు రోగుల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్టు వైద్యులు చెపుతున్నారు. ఈ కేరళ సరిహద్దు ప్రాంతమైన మంగళూరులో గుర్తించినట్టు సమాచారం.
 
మరోవైపు, కేరళలో ఈ వైరస్ ధాటికి ఇప్పటికే 10 మంది చనిపోయారు. వీరిలో నిపా వైరస్ రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన లినీ అనే నర్సు కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించాయి. అలాగే, కేంద్ర రాష్ట్ర వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. 
 
అయితే, గడచిన 24 గంటల్లో నిపా వైరస్ ప్రభావంతో రోగులెవరూ ఆసుపత్రిలో చేరలేదని కేరళ వైద్యఆరోగ్యశాఖ మంత్రి శైలజ ప్రకటించడం కాస్త ఊరట కలిగించే అంశం. కానీ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఇద్దరు రోగులకు నిపా వైరస్ వ్యాపించిందని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరు రోగులకు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో కలకలం చెలరేగింది. 
 
కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ నిపా వైరస్ అనుమానంతో కర్ణాటక వైద్యఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ సమీపంలోని ఓ గ్రామంలో మూసా కుటుంబసభ్యులకు పెంపుడు జంతువుల ద్వార సోకిందని తమ పరీక్షలో తేలిందని జాతీయ పశుసంవర్ధకశాఖ కమిషనర్ డాక్టర్ సురేష్ వెల్లడించారు.