శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (15:14 IST)

కర్నాటకలో ఏడు తలల పాము కుబుసం .. వింతగా చూస్తున్న స్థానికులు

కర్నాటక రాష్ట్రంలోని ఓ గ్రామంలో ఓ వింతైన పాము కుబుసం కనిపించింది. ఆ కుబుసానికి ఏకంగా ఏడు తలలు ఉండటమే. కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారిగౌడన దొడ్డి అనే గ్రామంలో ఈ వింత స్థానికుల కంటపడింది. 
 
సాధారణంగా ప్రతి పౌర్ణమినాటికి పాములు తమ కుబుసాన్ని విడిచిపెడుతుంటాయి. అయితే, ఈ గ్రామంలో కొందరు గ్రామస్థులకు ఏడు తలలు కలిగివున్నట్టువంటి కుబుసం ఒకటి కనిపించింది. ఈ విషయం గ్రామం మొత్తం వ్యాపించింది. దీంతో దీన్ని చూసేందుకు స్థానికులంతా క్యూకడుతున్నారు. 
 
పైగా, ఈ కుబుసం కూడా ఓ దేవాయానికి సమీపంలో కనిపించడంతో దీన్ని దైవమాయగా పేర్కొంటున్నారు. ఇలాంటి పాములు పురాణ గాథల్లో చదువుకున్నామనీ, ఇపుడు నిజంగానే తమ గ్రామంలో ఉన్నట్టుగా తెలుస్తోందని వారు చెపుతున్నారు. మరోవైపు, ఈ తరహా పాములు ఉండే అవకాశమే లేదని పాము నిపుణులు కొట్టిపారేస్తున్నారు.