ఐదేళ్లూ పాలించే అధికారం ఇవ్వండి : పవన్ కళ్యాణ్ పిలుపు

తనకు ఐదేళ్లూ పాలించే అవకాశం ఇస్తే ఎప్పటికీ తమనే కోరుకునేలా పరిపాలన అందిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిచేశారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా, ఆయన సోమవారం విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోటలోన

pawan kalyan
pnr| Last Updated: సోమవారం, 2 జులై 2018 (17:20 IST)
తనకు ఐదేళ్లూ పాలించే అవకాశం ఇస్తే ఎప్పటికీ తమనే కోరుకునేలా పరిపాలన అందిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిచేశారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా, ఆయన సోమవారం విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోటలోని దేవిగుడి జంక్షన్‌లో ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, జనసేనకు ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండని, ఎప్పటికీ తమనే కోరుకునేలా పరిపాలన అందిస్తామన్నారు.
 
తాము సరికొత్త మార్పును తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సి ఉందని, ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సి ఉందని అన్నారు. ప్రజల సమస్యలను తొలగించడానికే జనసేన పార్టీ ఆవిర్భవించిందని, అధికారం కోసం కాదన్నారు. కానీ, అనేక ప్రాంతాల్లో నెలకొనివున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా తమ పార్టీకి అధికారం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తరాంధ్రాని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశలకి, ఆకాంక్షలకి ప్రభుత్వం అనుగుణంగా లేదని అన్నారు. కాగా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. దీనిపై మరింత చదవండి :