శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (15:38 IST)

ఆ క్రికెటర్ ప్రపంచ క్రికెట్‌కు అరుదైన సంపద : నరేంద్ర మోడీ

ఆఫ్ఘనిస్థాన్ యువ క్రికెటర్ రషీద్ ఖాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ క్రికెట్‌కు లభించిన అరుదైన సంపద అని ఆయన అభివర్ణించారు. ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్‌ రేడియో కార్

ఆఫ్ఘనిస్థాన్ యువ క్రికెటర్ రషీద్ ఖాన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ క్రికెట్‌కు లభించిన అరుదైన సంపద అని ఆయన అభివర్ణించారు. ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో సంబంధాల గురించి మోడీ మాట్లాడుతూ.. ఇటీవల ఆ దేశ క్రికెట్‌ జట్టు భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన విషయాన్ని ప్రస్తావించారు.
 
ఇది ఇరు దేశాలు గర్వించే అంశంగా వ్యాఖ్యానించిన ఆయన... ఈ క‍్రమంలోనే రషీద్‌ ఖాన్‌ను కొనియాడారు. వరల్డ్‌ క్రికెట్‌కు రషీద్‌ ఒక విలువైన ఆస్తిగా అభివర్ణించారు. ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌-11 సీజన్‌లో రషీద్‌ రాణించడాన్ని ఈ సందర్భంగా మోడీ గుర్తుచేసుకున్నారు.
 
అలాగే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ అత్యుత్తమమైందని, ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ ప్రజలు ఎంతో బాగా జరుపుకున్నారన్నారు. రాజస్థాన్‌లో లక్ష మంది ఏకకాలంలో యోగా చేసి రికార్డు సృష్టించారని, దేశ సరిహద్దుల్లో ఉండే జవాన్లు సైతం యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుకున్నారన్నారు.