ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (17:02 IST)

దేశంలో జనం తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేసి పారేస్తారేమో?

రుణాలు మాఫీ అనే తాయిలంతో ఓట్లను కొల్లగొడుతున్న పార్టీలు ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం మాఫీలు చేస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఏకంగా రూ. 650 కోట్ల విలువైన విద్యుత్ బిల్లుల బకాయిలను మాఫీ చేసిపడేసింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ బిల్లులు కట్టకుండా వున్న మొండి బాకీలన్నీ ఒక్క దెబ్బకు ఎగిరిపోయాయి. ఇంకేం... గుజరాత్ రాష్ట్రంలోని గ్రామీణ జనం హ్యాపీగా కరెంటును ఎంతబడితే అంత ఉపయోగించుకోవచ్చన్నమాట. ఇది భాజపా చేసిన పని.
 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో రైతుల రుణ మాఫీ హామీ ఇచ్చింది. ఇచ్చినమాట ప్రకారం ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన కమల్‌నాథ్ రెండు గంటల్లోనే రైతు రుణమాఫీపై సంతకం చేసి ఒకే దెబ్బకు కట్టాల్సిన రుణాలన్నీ మాఫీ చేశారు. ఛత్తీస్ గఢ్ లోనూ అదే జరిగింది. 
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తాము చెప్పిన పని చేస్తామంటూ వ్యాఖ్యానించారు. అంతే... ఆగ్రహంతో ఊగిపోయిన గుజరాత్ ముఖ్యమంత్రి విద్యుత్ బిల్లుల బకాయిలను మాఫీ చేసి తనేంటో చూపించారు. మరి ఇదే ఊపుతో దేశంలో జనం తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేసి పారేస్తారేమో? చూడాలి వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి ఏమయినా జరగొచ్చు.