Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమికుల దినోత్సవం : హైదరాబాద్ నగరంలో బెస్ట్ గేట్‌వేస్ ఏవి?

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:47 IST)

Widgets Magazine
Valentine's Day

ఈనెల 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం. ఈ వేడుకలను ఒక పండుగలా జరుపుకునేందుకు ప్రేమ జంటలు సిద్ధమైపోయాయి. ఇందుకోస తమ బడ్జెట్‌కు తగ్గినట్టుగా, తమకు అనుకూలంగా ఉండే రొమాంటిక్ గేట్‌వేలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో ఉన్న రొమాన్స్ కేంద్రాలను పరిశీలిస్తే...
 
హుస్సేన్‌ సాగర్ ‌- నెక్లెస్‌ రోడ్‌ : తథాగతుని చెంత ఉన్న హుస్సేన్‌సాగర్‌, దగ్గరలోని లుంబినీ పార్క్‌ - ఎన్‌టీఆర్‌ గార్డెన్స్‌, ఈట్‌స్ట్రీట్‌ వంటి ప్రాంతాలు ప్రేమికులకు అనుకూలంగా ఉంటాయి.
 
కేబీఆర్‌ పార్క్‌ : నగర నడిబొడ్డున ప్రకృతి సోయగంతో విరాజిల్లుతుందీపార్క్‌. చేతిలో చేయి వేసుకుని ఈ పార్క్‌లో నడుచుకుంటూ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. ప్రేమలో మునిగే వారు, ఇప్పటికే మునిగిన వారు ఈ పార్క్‌లో ఎంత దూరం నడిచినా అలసట అనిపించదు.
 
అనంతగిరి హిల్స్‌ : నగరానికి కాస్త దూరంగా, వికారాబాద్‌ దగ్గర ఉన్న అనంతగిరి హిల్స్‌... రొమాంటిక్‌ డెస్టినేషన్‌గా ప్రేమికులకు నిలుస్తుంది.
 
షామీర్‌పేట లేక్‌ : ఏకాంతంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వలస పక్షుల కిలకిల రాగాలు వినాలనుకుంటే ఇది ఎంతో అనుకూలమైన ప్రాంతం.
 
సీక్రెట్‌ లేక్‌ : ఒకప్పుడు సీక్రెట్‌ లేక్‌గా ఇప్పుడు దుర్గం చెరువుగా ప్రసిద్ధిగాంచిన ఈ సహజసిద్ధమైన చెరువు లవర్స్‌కు మాత్రం ఎప్పటికీ అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి.
 
తారామతి - బారాదరి : చరిత్రలోకి తొంగిచూస్తూ మధురస్మృతులలో జారిపోవాలనుకుంటే తారామతి - బారాదరి కూడా అత్యుత్తమ గేట్‌వేలలో ఒకటిగా చెప్పవచ్చు. వారాంతాలలో అయితే గజల్స్‌, ఖవ్వాలీలను కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రేమికుల దినోత్సవం గేట్‌వే హైదరాబాద్ ప్రేమికులు Getaways Hyderabad Valentine's Day Valentine Day Celebrations

Loading comments ...

ప్రేమాయణం

news

ప్రేమికుల దినోత్సవం స్పెషల్ : వీడియోను మళ్లీమళ్లీ చూస్తున్నారు

ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం. వాలంటైన్స్ డే. దీన్ని పురస్కరించుకుని మలయాళంలో ఓ ...

news

రాధను తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో కూర్చోపెట్టుకొని...

వాలెంటైన్స్ డే అనగానే ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. ప్రేమ అంటే నమ్మకం. ప్రేమికుల మద్య ...

news

ఇవాళ Propose Day, వాలెంటైన్ డే వెంటనే Slap Day, ఆ తర్వాత Breakup Day ఏంటిదీ?

వాలెంటైన్ డే వస్తుందనగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యమ జోరుగా చర్చ జరుగుతుంటుంది. ఇక ...

news

భాగస్వాముల మధ్య ప్రేమ చిగురించే ఆహారాలేంటో తెలుసా?

భాగస్వాముల మధ్య ప్రేమ భావాలను పెంపొందించే ఆహారం గురించి మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ ...

Widgets Magazine