మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (11:33 IST)

ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే వాస్తు దోషం పట్టుకుంటుందట..

వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు. వారు పాటించని వారి కంటే ముందంజలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఆందోళనలు కలుగుతాయి.


కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కువగా అప్పులు చేయడం, మానసిక రుగ్మత, ఒత్తిడి, కుటుంబంలో కలహాలు వంటివి ఇంటికి వాస్తులేదని సూచిస్తాయి. 
 
వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి. నేల అడుగున గుళ్లు. శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును, ఆయన నక్షత్రాన్ని బట్టీ, ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. అయితే ఒక్కోసారి ఇళ్లంతా వాస్తు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతుంటాయి. 
 
అందుకు కొన్ని కారణాలుంటాయి. ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ ఇంటికి వాస్తు దోషం పట్టుకుంటుంది. అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఇంటికి వాస్తు దోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు. మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు వస్తే కూడా దోషం ఉన్నట్లే లెక్క.