శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (12:24 IST)

వంట గదిలో సింక్ ఏ దిశలో ఉండాలంటే?

గృహంలో ఆగ్నేయ భాగమున వంటగదిని ఏర్పాటు చేస్తే ఎన్నో శుభఫలితాలను పొందవచ్చని వాస్తుశాస్త్రం చెబుతోంది. కుటుంబ సుఖశాంతులకు ఆగ్నేయదిశలో వంటగది ఏర్పాటు ముఖ్యమని వాస్తు నిపుణుల అంటున్నారు. తూర్పు, ఉత్తర, ఈశాన్యముల కంటే ఆగ్నేయములో ఎక్కువ ఖాళీ స్థలము ఉంటే అశు

గృహంలో ఆగ్నేయ భాగమున వంటగదిని ఏర్పాటు చేస్తే ఎన్నో శుభఫలితాలను పొందవచ్చని వాస్తుశాస్త్రం చెబుతోంది. కుటుంబ సుఖశాంతులకు ఆగ్నేయదిశలో వంటగది ఏర్పాటు ముఖ్యమని వాస్తు నిపుణుల అంటున్నారు. తూర్పు, ఉత్తర, ఈశాన్యముల కంటే ఆగ్నేయములో ఎక్కువ ఖాళీ స్థలము ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. 
 
ప్రతి నివాస గృహంలో తప్పనిసరిగా వంటగది నిర్మించడం జరుగుతుంది. గృహ యజమాని స్తోమతను బట్టి ఇంట్లో వంటగది ఏర్పాటు చేసుకుంటారు. ఆ వంటగదిని గృహవాస్తు ప్రకారం మూడు విధాలుగా ఏర్పాటుచేస్తారు. గృహావరణలోని ఖాళీ ప్రదేశంలో ఒక ఉపగృహం నిర్మించి దాన్ని వంటగదిగా వాడతే మంచిది. 
 
వాస్తు రీత్యా వంట లేదా అగ్ని అనేది గృహం ఆవరణలో అగ్ని స్థానమైన ఆగ్నేయంలో ఉండాలి. విశాలమైన ఆగ్నేయ ఆవరణ ఉన్నవాళ్లు ఉపగృహంలో వంటగది ఏర్పాటుచేసుకోవచ్చును. ఇకపోతే వంటగదిలో సింకును వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టించుకుంటే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.