మహిళలు ముగ్గు వేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలా? ఏంటవి?
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి ముంగిళ్లలో ముగ్గులు వేయడం వల్ల ఇంటికి అందమే కాదు.. ముగ్గు వేసే స్త్రీకి కూడా ఎన్నో ప్రయోజనాలూ లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వాకిళ్ళను ఆవు పేడను కలిపి కళ్లాపి జల్లుతారు. ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్రిమికీటకాల్ని అడ్డుకోగల లక్షణాలు కలిగివుంటాయి. వీటివల్ల ఆ ఇంట్లోకి వ్యాధులు ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
అలాగే, ముగ్గులు వేయడం అనేది స్త్రీలకు మంచి శారీరక వ్యాయంగా చెప్పొచ్చు. ముగ్గు వేసేందుకు కూర్చోవడం, వంగడం, పైకి లేవడం, చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుంది. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది.