శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (09:34 IST)

ఆకట్టుకునే పెదవుల కోసం... లైట్ కలర్స్ బెస్ట్

ముఖ్యంగా పెదవుల మేకప్ విషయంలో స్త్రీలు ఎక్కువగా శ్రద్ద తీసుకుంటున్నారు. లిప్ స్టిక్ అనేది మహిళ అందాన్ని మరింత ఎక్కువగా చూపిస్తుంది. స్త్రీలు మొహానికి మేకప్ వేసేందుకు మరిచిపోయినా, పెదవులకు మాత్రం మేకప్ వేయడానికి మరిచిపోరు. ఇతరులను ఇట్టే ఆకట్టుకునే పెదవుల కోసం మహిళలు లిప్ బామ్‌, లిప్ స్టిక్స్‌ వంటివి విరివిగా వాడతుంటారు. అయితే కొందరు ఏదో లిప్ స్టిక్ వేసేసుకుని ఆఫీసులకు పరుగులు తీస్తుంటారు. అలాంటి మహిళలకు కొన్ని చిట్కాలు. 
 
ముందుగా లిప్ లైనర్ వేసుకోవాలి. పెన్సిల్ తరహాలో ఉన్న లిప్‌ లైనర్‌తో అవుట్ లైన్ వేసుకుని లైనప్ లోపలి నుంచే లిప్ స్టిక్ వేసుకోవాలి. అప్పుడే ఇతరులకు ఆకట్టుకునే విధంగా మీ పెదవులు ఉంటాయని బ్యూటీషన్లు చెబుతున్నారు.
 
అలాగే లిప్‌స్టిక్స్‌కు తగిన రంగుకు తగ్గట్టు లిప్ లైనర్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా మాశ్చరైజర్ లేని లిప్ లైనర్‌లను పెదవులకు ఉపయోగించేటప్పుడు కాస్త క్రీమ్‌ను రాసుకోవడం మంచిది. ఇలా క్రీమ్ రాయడం ద్వారా పెదవులు ఎండిపోకుండా ఉంటాయని బ్యూటీషన్లు చెబుతున్నారు.
 
లైట్ కలర్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. అయితే ఈ కలర్స్ వినయోగించడం వల్ల ప్రత్యేకంగా కనబడకపోవచ్చు. అయితే చూడటానికి మాత్రం అందంగా కనిపిస్తుంటాయి. పింక్ కలర్ లిప్స్ స్టిక్ వాడేటప్పుడు లిప్ లైనర్ వాడకూడదు. అప్పుడు పెదాలు సాధారణ రంగును కలిగి ఉంటాయి.