శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (17:48 IST)

గర్భిణీలు వేసవిలో పుచ్చకాయలు తీసుకుంటే?

వేసవిలో గర్భిణీ మహిళలు పుచ్చకాయలు తీసుకుంటే.. గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు, ఎసిడిటి, జీర్ణ సంబంధిత సమస్యలు వంటి సాధారణ సమస్యలను నివారిస్తుంది. హార్ట్ బర్న్‌కు కారణం అయ్యే వాటర్ మెలోన్ ఎసిడిటి, ఎసిడిక్ రిఫ్లెక్షన్ నివారిస్తుంది. గర్భిణీల్లో ఉదయంలో వికారం, వాంతులను నివారించడానికి ఫ్రెష్ వాటర్ మెలోన్ జ్యూస్‌ను త్రాగాలి. గర్భధారణ సమయంలో తీసుకోవడం ఇది ఒక న్యూట్రీషియన్ హెల్తీ ఫుడ్.
 
గర్భిణీ స్త్రీలలో డీహైడ్రేషన్‌‍కు గురిఅయితే ప్రీమెచ్చుర్ బర్త్, యూట్రస్ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే ద్రవాలు, మరియు విటమిన్స్ పుష్కలంగా అందిస్తాయి. గర్భధారణ సమయంలో అదీ వేసవి కాలంలో బాడీ రాషెస్‌ను తగ్గించుకోవచ్చు. ఈ పరిస్థితిలో వాటర్ మెలోన్ తినడం వల్ల బాడీ హీట్, స్కిన్ రాషెస్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.