శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By PNR
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2014 (18:47 IST)

వక్షోజాలు జారి పోవడానికి కారణం!

సాధారణంగా చాలామంది యువతుల్లో వక్షోజాలు కిందకు జారిపోయి ఉంటాయి. మరికొందరిలో బిగుతుగా ఉంటాయి. ఇలాంటి యువతుల కంటే.. కిందకు జారి ఉన్న యువతుల పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా.. నలుగురి మధ్య కలివిడిగా ఉండేందుకు వెనుకడుగు వేస్తుంటారు. 
 
ఇలాంటి వారు తమ సమస్యను స్నేహితురాళ్ళతో చెప్పుకుని మథన పడుతుంటారు. దీనివల్ల భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అని భయపడుతుంటారు. అయితే, ఈ విషయాన్ని సెక్సాలజిస్టుల వద్ద ప్రస్తావిస్తే మాత్రం వారి స్పందన ఇలా ఉంది. సాధారణంగా కొంతమంది యువతుల్లో వక్షోజాలు జారి ఉండడం అనేది సాధారణం. 
 
వక్షోజాలను గట్టిగా నొక్కడం వల్ల అలా జారిపోయాయనడంలో అర్థం లేదని, అదంతా కేవలం అపోహ మాత్రమేనని చెపుతున్నారు. ఇక వక్షోజాలు జారినట్లు కనిపించకుండా ఉండాలంటే ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల బ్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ధరించడం వల్ల శాశ్వత పరిష్కారం లభించక పోయినా.. వక్షోజాలు బిగుతుగా ఉన్నట్లు చూపరులకు కనిపిస్తాయి. 
 
ముఖ్యంగా.. వక్షోజాలు జారి ఉన్నంత మాత్రన పెళ్లి తర్వాత ఇబ్బందులు వస్తాయనుకోవడం పొరపాటేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వైద్యులు అంటున్నారు. శారీరక మార్పుల వల్ల ఇవి చోటు చేసుకుంటాయని చెపుతున్నారు. యువతులు ఎక్కువగా బోర్లా పడుకోవడం వల్ల కూడా వక్షోజాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల బిగుతుగా ఉండే వక్షోజాలు.. జారినట్టు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు.