ఒకరితో స్నేహం.. మరొకరితో ప్రేమ.. అమ్మాయిల నయా ట్రెండ్

నేటికాలపు అమ్మాయిల మనస్తత్వాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకరితో ప్రేమలో మునిగితేలుతూనే మరొకరితో యువకుడితో స్నేహం పేరుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ కారణంగా పలు విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజా

pnr| Last Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (17:17 IST)
నేటికాలపు అమ్మాయిల మనస్తత్వాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకరితో ప్రేమలో మునిగితేలుతూనే మరొకరితో యువకుడితో స్నేహం పేరుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ కారణంగా పలు విపరీతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో నేటి కాలపు అమ్మాయిలు ఒకరికంటే ఎక్కువ పురుషులతో ప్రేమాయణం నడపుతున్నట్లు తేలింది.
 
ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి నెట్వర్కింగ్ ద్వారా తమ పరిచయాలను మరింత బలపరుచకుంటున్నారట. ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసే అమ్మమాయిలు ముక్కూమొహం తెలియని వారితో ప్రేమలో పడుతున్నారు. అలాగే, కాలేజీస్థాయిలో కుదిరిన స్నేహం ఒక ప్రేమికుడిని సంపాదిస్తే, వృత్తిరీత్యా ఉద్యోగంలో చేరిన చోట మరో లవర్‌ను తెచ్చి పెడుతోందట. దీంతో అమ్మాయిలు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపేస్తున్నారట. 
 
ఇటువంటి ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నవారిలో అమ్మాయిలే టాప్ అని సర్వేలో తేలింది. అమ్మాయిల్లో 18 శాతం మంది ఇద్దరు పురుషులతో ఏక కాలంలో లవ్వాట సాగిస్తుంటే కేవలం 15 శాతం మంది అబ్బాయిలు మాత్రం ఇటువంటి ప్రేమాయణాన్ని సాగిస్తున్నారట. మొత్తమ్మీద ప్రేమాయణంలోనూ అమ్మాయిలే ఫస్ట్ అనిపించుకుంటున్నారన్నమాట.దీనిపై మరింత చదవండి :