శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (10:18 IST)

స్కిన్ టోన్‌కు అనుగుణంగా లిప్‌స్టిక్ కలర్‌ల ఎంపిక!

లిప్‌స్టిక్‌ కొనేటప్పుడు ఏలాంటి రంగు ఎంపిక చేసుకోవాలో తెలీక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొందరు సింగిల్‌ కలర్‌ లిప్‌స్టిక్స్‌లో దేన్ని ఎంచుకోవాలో తెలియక డబుల్‌ కలర్‌ లిప్‌స్టిక్స్‌ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే స్కిన్‌ టోన్‌న్ని బట్టి లిప్‌స్టిక్‌ కలర్‌ని ఎలా ఎంచుకోవాలో తెల్సుకుందాం.
 
చామన ఛాయగా ఉన్న వారు ముదురు రంగు లిప్‌స్టిక్‌ వేసుకోవచ్చు. వీరు పెదాలకు పింక్‌, వంకాయ రంగు లిప్‌స్టిక్‌ వేసుకుంటే అందం రెట్టింపవుతుంది. అయితే వీరికి ఎరుపు అంతగా నప్పుదు. 
 
తెల్లగా ఉన్నవారు కూడా ముదురు రంగు లిప్‌స్టిక్‌ వేసుకొంటే అందంగా కనిపిస్తారు. పింక్‌, ఎరుపు రంగులు బాగా నప్పుతాయి. అలాగే వారికి గోధుమ రంగులో ఉండే లిప్‌స్టిక్స్‌ అంత సెట్‌కావు. 
 
నల్లగా ఉండే వారు చాక్లెట్‌, మెరూన్‌ రంగు లిప్‌స్టిక్‌ల్లో చాలా అందంగా కనబడతారు. వీరికి పర్పుల్‌, గోధుమ రంగు లిప్‌స్టిక్‌లు కూడా అందంగా ఉంటాయి.