శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (12:20 IST)

నిత్యయవ్వనులుగా కనిపించాలా? ఐతే డ్రైఫ్రూట్స్ తీసుకోండి..

వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారా? నిత్యయవ్వనులుగా కనిపించాలనుకుంటున్నారా? అయితే రోజువారీ డైట్‌తో పాటు నట్స్ తీసుకోవాలన ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హార్మోన్లు, ఒత్తిడి, పౌష్టికాహార లోపం కారణంగా వయ

వయసు మీద పడినట్లు కనిపిస్తున్నారా? నిత్యయవ్వనులుగా కనిపించాలనుకుంటున్నారా? అయితే రోజువారీ డైట్‌తో పాటు నట్స్ తీసుకోవాలన ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హార్మోన్లు, ఒత్తిడి, పౌష్టికాహార లోపం కారణంగా వయసు తొందరగా మీద పడినట్లు కనిపిస్తారు. అందుకే రోజువారీ డైట్‌లో ఎండబెట్టిన ఆప్రికాట్లు, ఖర్జూరం వంటివి తీసుకుంటే ఈస్ట్రోజన్‌ హార్మోన్లను పెంచుతాయి.
 
అలాగే పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా  వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో అధికంగా ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్లు.. చిన్నతనంలో వచ్చే మెనోపాజ్‌ను దరిచేరకుండా చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక మొలకెత్తిన పెసలు, శెనగలు వంటివి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది. ఇంకా సోయాను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.